ప్రస్తుత రోజుల్లో చాలామందికి ఎదురయ్యే ప్రధాన సమస్య ఉద్యోగం. తాము చదివిన చదువుకు, చేసిన కోర్సులకు సరైన ఉద్యోగం దొరకకపోవడం చాలా మందిని ఇబ్బందిపెడుతోంది. అయితే, కొన్ని చిన్న చిట్కాలను పాటించడం ద్వారా అనుకున్న ఉద్యోగాన్ని పొందవచ్చు.
భోళాశంకరుడి (పరమశివుడు) అనుగ్రహం కోసం నువ్వుల నూనెలో నానబెట్టిన మూడు వత్తులను దీపాలుగా వెలిగించడం మంచిది. పరమేశ్వరుడు స్పటిక లింగంగా ఉన్న శివాలయాల్లో విభూతితో అభిషేకం చేయించడం కూడా చాలా శ్రేయస్కరం. ఈ కార్యం ఉద్యోగం కోసం కష్టపడుతున్న వారికి మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా, రాశి ఉసిరికాయపై నేతితో దీపారాధన చేసి, రావిచెట్టు కింద వెలిగించడం ద్వారా కూడా అనుకూల ఫలితాలు పొందవచ్చు.
నవగ్రహాలకు నమస్కారం చేసి, నవగ్రహ స్తోత్రాలు చదవడం వల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. మానవ ప్రయత్నం ద్వారా స్వామి అనుగ్రహం పొందడం ద్వారా ఉద్యోగం ఖచ్చితంగా లభిస్తుంది. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కోసం నువ్వుల నూనెలో ఐదు వత్తులను వెలిగించడం శ్రేయస్కరం. శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలతో అర్చన చేస్తే ఉన్నతమైన పదవులు లభించవచ్చు.