NITYA PARAYANA SLOKAS
Mangalam Govindunaku Lyrics in Telugu: A Devotional Hymn for Lord Govinda
December 6, 2024
1 min read
5
మంగళము గోవిందునకు జయ మంగళము గరుడ ధ్వజునకు
మంగళము జయ మంగళము ధర్మ స్వరూపునకు | జయ జయ మంగళము ||
ఆదికిను ఆద్యైన దేవునకచ్యుతునకంభోజ నాభున-
కాదికూర్మంబైన జగదాధార ముర్తికిని
వేద రక్షకునకును సంతత వేదమార్గ విహారునకు బలి-
భేదినికి సామాదిగాన ప్రియ విహారునకు || జయ జయ మంగళము ||
హరికి పరమేశ్వరునకు శ్రీధరునకు కాలాంతకునకును
పరమ పురుషోత్తమునకు బహుబంధ దూరునకును
సురముని స్తోత్రునకు దేవాసురగణ శ్రేష్టునకు కరుణా
కరుణకును కాత్యాయినీ నుత కలిత నామునకు || జయ జయ మంగళము ||
పంకజాసన వరదునకు భవ పంక విచ్ఛేదునకు భవునకు
శంకరునకవ్యక్తునకు నాశ్చర్యరూపునకు
వేంకటాచల వల్లభునకును విశ్వముర్తికి నీశ్వరునకును
పంకజా కుచకుంభ కుంకుమపంక లోలునకు || జయ జయ మంగళము ||
Mangalam Govindunaku lyrics in Telugu
Lord Govinda songs
Telugu devotional songs
Hindu auspicious hymns
Mangalam prayer
Govinda bhakti songs
spiritual hymns in Telugu
Hindu devotional lyrics
Mangalam meaning